![]() |
![]() |
.webp)
జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -254 లో.... శకుంతల అన్న మాటలకి ప్రమీల ఏడుస్తుంది. వీరు, ఇషిక ఒకరికొకరు చూసుకొని నవ్వుకుంటారు. అది గంగ గమనిస్తుంది ఇంట్లో అందరు ఎక్కడి వారు అక్కడికి వెళ్తారు. రుద్ర దగ్గరికి గంగ వెళ్తుంది. ఇంట్లో ఏం జరిగిన మీరు సైలెంట్ గా ఉంటారా.. ఆ వీరు దీనంతటికి కారణం అని తెలిసినా.. ఏం అనరా.. ఎందుకు అంటే మీ చెల్లి బాధపడుతుంది.. మీ పెద్దమ్మ బాధపడుతుంది.. కానీ ప్రమీల అక్క బాధపడ్డ పర్వాలేదా అని రుద్రతో గంగ అంటుంది.
ఇప్పుడు ఏం చెప్పమంటావ్.. ఇప్పుడు వాడి గురించి చెప్తే ఇంట్లో గొడవలు తప్ప ఏం ఉండవు.. నేను వాడిని మంచిగా మార్చాలనుకుంటున్నానని రుద్ర అంటాడు. మరొకవైపు ప్రమీల సూపర్ మార్కెట్ కి రాలేదని మక్కమ్, కార్తీక్ మాట్లాడుకుంటారు. ప్రమీలకి కార్తీక్ ఫోన్ చేసి ఎందుకు మేడం ఈ రోజు సూపర్ మార్కెట్ కి రాలేదని అడుగుతాడు. నా ఇష్టం వర్కర్ వర్కర్ లాగే ఉండమని ప్రమీల కోప్పడి ఫోన్ కట్ చేస్తుంది. దాంతో కార్తీక్ బాధపడతాడు. మరొకవైపు విశ్వ స్వీట్ తీసుకొని వచ్చి సుధకి ఇచ్చి మీ అన్నయ్య కుటుంబంలో ఏదో గొడవలంట అని హ్యాపీగా ఫీల్ అవుతాడు. లక్ష్మీ దగ్గరికి సుధా వెళ్లి ఒకసారి గంగకి ఫోన్ చెయ్ అని చెప్పగానే తను ఫోన్ చేస్తుంది.. గంగతో సుధ ఫోన్ మాట్లాడుతుంది. ఇంట్లో గొడవలు అమ్మ అని గంగ చెప్పగానే అన్నిటికి ఆ దేవుడున్నాడని సుధ అంటుంది.
మరుసటిరోజు గంగ పూజ చేసి హారతి ఇస్తుంది. ప్రమీల దగ్గరికి శకుంతల వచ్చి.. సారీ నువ్వు అంటే నాకు చాలా ఇష్టం.. ఎక్కడ నాకు దూరం అవుతావోనని అలా మాట్లాడానని అనగానే అత్తయ్య మీరు నాకు సారీ చెప్పడమేంటి.. ఎప్పటికి నేను మీ కోడలినే ఇదే నా కుటుంబమని ప్రమీల అనగానే ప్రమీలని శకుంతల హగ్ చేసుకుంటుంది. హమ్మయ్య అంత సెట్ అయిందని పెద్దసారు అంటాడు. ఇషిక, వీరు డిస్సపాయింట్ అవుతారు. తరువాయి భాగంలో విశ్వ దగ్గరికి వెళ్ళి బాక్సింగ్ నేర్చుకుంటానని రుద్రకి గంగ చెప్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |